కరోనా ముప్పు తప్పిందని..వాక్సిన్ వచ్చింది..ఇక ఏ భయం అవసరం లేదని అనుకున్నారో ..లేదో ఇప్పుడు కరోనా మహమ్మారి మరో రూపంలో ప్రజలపై విరుచుకుపడుతుంది. ఓమిక్రాన్ పేరుతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుంది. దేశంలో రోజు రోజుకు ఓమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతుండడం తో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక మార్గదర్శకాలు జారీచేసింది.
రానున్న పండుగల నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, పండుగల వేళ ఒమిక్రాన్ కట్టడికి రాత్రి కర్ఫ్యూలు అమలు చేయాలని కేంద్రం నిర్దేశించింది. భారీ సభలు, సమూహాలు నియంత్రించాలని స్పష్టం చేసింది. బాధితుల శాంపిల్స్ ను ఆలస్యం చేయకుండా జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని సూచించింది. డెల్టా, ఒమిక్రాన్ కేసులపై తరచుగా పరిశీలన జరపాలని, పాజిటివిటీ, డబ్లింగ్ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై దృష్టి సారించాలని తెలిపింది.
దీంతో మధ్యప్రదేశ్ వేగంగా స్పందించింది. ఇవాళ రాత్రి నుంచి రాత్రి కర్ఫ్యూ స్టార్ట్ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ష్యూ అమల్లో ఉంటుంది. తదుపరి ఆదేశాలు అమలు చేసే వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.