తెలంగాణ లో ఓమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో క్రిస్మస్ , న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించింది. ఒమిక్రాన్ వైరస్ తీవ్రత దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్,న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని ఆదేశించింది. ఇతర పండుగల విషయంలో ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. సెలబ్రేషన్స్ పేరుతో జనం గుంపులు గుంపులుగా గుమి కూడాదని మూడరోజుల్లో ఆదేశాలివ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఉన్న విధంగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జనాలకు తగిన పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని హైకోర్టు సర్కాకు చెప్పింది.
ఇక దేశ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మొదట్లో ఒకటి , రెండే అనుకున్నప్పటికీ..ఇప్పుడు 257 కు చేరింది. ఇక తెలంగాణ ఓమిక్రాన్ కేసుల్లో దేశంలోనే మూడోస్థానంలో ఉండడం రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. నిన్న తెలంగాణలో కొత్తగా 14 ఓమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీ, మహారాష్ట్ర తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది. తెలంగాణలో నిన్న కొత్త కేసులతో కేసుల సంఖ్య 38కి చేరింది. ఇక కేరళలో 9, రాజస్థాన్ 4, ఢిల్లీ 3, బెంగాల్ 2, ఏపీలో 1 కేసు నమోదైంది. దీంతో పాటు హర్యాన్ రాష్ట్రంలో తొలిసారిగా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో 6 కొత్త ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 257కు పెరిగింది.