ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

కేశినేని నానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్‌చార్జి ఇవ్వడం ఫై భగ్గుమన్న బుద్దా వెంకన్న వర్గం

అంత అనుకున్నట్లే అయ్యింది..తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు..కేశినేని నానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్‌చార్జి ఇవ్వడం ఫై బుద్దా వెంకన్న వర్గం రోడ్డెక్కారు. గత కొద్దీ రోజులుగా ఈ పదవి కోసం బుద్ధా వెంకన్న, నాగుల్‌ మీరా ఆశించినప్పటికీ చివరకు చంద్రబాబు మాత్రం నానికి అప్పజెప్పారు. దీంతో వెంకన్న ను కాదని నానికి ఎలా ఇస్తారంటూ వెంకన్న వర్గం ఆందోళన చేపట్టారు.

ఇంఛార్జ్ పదవి కేశినేని నానికి ఇవ్వొద్దంటూ .. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే బాధ్యత అప్పగించాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా కృషి చేశారని.. ఎంపి కేశినేని నాని నియంతృత్వ పోకడల వల్లే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ నష్టపోయిందన్నారు. చంద్రబాబు నివాసంపై దాడి చేసినా, మంత్రులు బూతులు తిట్టినా కేశినేని స్పందించ లేదన్నారు నేతలు. వైఎస్సార్‌సీపీ నాయకుల విమర్శలపై ఎంపీ ఏ రోజైనా మాట్లాడారా అంటూ నిలదీశారు. చంద్రబాబు ఇంటి దగ్గర గొడవకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ వెళితే.. బుద్దా వెంకన్న వెళ్లి అడ్డుకున్నారని గుర్తు చేశారు. నానికి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు ఎవరూ సహకరించరని.. నాని నియామకాన్ని రద్దు చేయాలని చంద్రబాబును కోరారు.