గత నాల్గు రోజులుగా వంగవీటి రాధా పేరు వార్తల్లో హైలైట్ అవుతున్న సంగతి తెలిసిందే. తనను హత్య చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని..కొద్దీ రోజులుగా కొంతమంది వ్యక్తులు తనను ఫాలో చేస్తున్నారని చెప్పడం తో రాధా ను ఎవరు చంపడానికి ట్రై చేస్తున్నారని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో కొద్దీ రోజులుగా రాధా ఆఫీసు ముందు అనుమానాస్పదంగా ఓ స్కూటీ ఉందని..రాధా అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఇటు రాధా కార్యాలయాన్ని ఇంటెలిజెన్స్, ఎస్‌బీ పోలీసులు పరిశీలించారు.
రాధా కార్యాలయం దగ్గర వివరాలు సేకరించారు. స్కూటీ నాని అనే వ్యక్తిదిగా గుర్తించారు. రాధా కార్యాలయం పక్కన స్వీట్ షాపులో పనిచేసే వ్యక్తి స్నేహితుడిగా ఐడెంటిఫై చేశారు. వాహన పత్రాలు చూపించి స్కూటీ తీసుకువెళ్లాలని పోలీసులు సూచించారు. ఇదిలా ఉంటె తనకు ప్రాణ హాని ఉందని రాధా చెప్పడం తో..రాధాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. వెంటనే రాధాకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. దీంతో వంగవీటి రాధాకు 2+2 గన్‌మెన్స్‌ను కేటాయిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే, ప్రభుత్వానికి వంగవీటి రంగా ఊహించని రిప్లయ్ ఇచ్చారు. తనకు ఇచ్చిన 2+2 గన్‌మెన్స్‌ను వంగవీటి రాధా తిరస్కరించి పంపించి వేశారు. వంగవీటి రంగా అభిమానులే తనకు రక్షణ అని రాధా తెలిపారు.