తెలంగాణ

బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టు మెజిస్ట్రేట్ షాక్ ఇచ్చింది. 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సంజయ్ తో పాటు కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్‌, పుప్పాల రఘుకు జ్యుడీషియల్ రిమాండ్కాచు రవి, మర్రి సతీశ్‌కు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. మరో11 మంది పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్‌ ఆదివారం జన జాగరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. కరోనా ఆంక్షల నేపథ్యంలో దీక్ష కు అనుమతి లేదని పోలీసులు.. కార్యాలయంలోకి వెళ్లి సంజయ్‌ దీక్ష ను భగ్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, భాజపా కార్యకర్తల మధ్య.. తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత పోలీసులు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి మానకొండూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడే బండి సంజయ్ జాగరణ దీక్షను కొనసాగించారు. ఈ నేపథ్యంలో మానకొండూరు పోలీస్ స్టేషన్ నుంచి కరీంగనర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీదుగా బండి సంజయ్‌ను పోలీసులు తరలించారు.

ఇక బండి సంజయ్ సహా పలువురిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్, పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి కరీంనగర్​ కోర్టుకు తరలించారు. పోలీసుల వాదనలు విన్న కోర్ట్ బండి సంజయ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.