ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు అవకాశవాది..ఎవరినైనా లవ్‌ చేస్తారు

అవసరమైనప్పుడే లవ్‌ చేయడంలో సమర్థుడు: పొత్తుల‌పై సోము వీర్రాజు

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవకాశవాది అని అన్నారు. చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారని, అవసరం వచ్చిన‌ప్పుడు లవ్ చేయడంలో ఆయ‌న దిట్ట అని అన్నారు. ఆ తర్వాత ఆయ‌న‌ ఏం చేస్తారో త‌న నోటితో తాను చెప్పలేనని సోము వీర్రాజు చెప్పారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీని కూడా లవ్ చేశారని అన్నారు. కాగా జనసేన పార్టీ త‌మ మిత్రపక్షమే అని సోము వీర్రాజు చెప్పారు.

పంజాబ్‌లో ప్రధాని మోడీ ప‌ర్య‌ట‌న వేళ భద్రత వైఫ‌ల్యం గురించి సోము వీర్రాజు మాట్లాడుతూ… ఈ ఘ‌ట‌న‌పై నిరసనలు తెలియచేస్తామ‌ని తెలిపారు. కాగా, చంద్రబాబు నాయుడే ప్లాన్ వేసి ఏపీలో బీజేపీతో సభలు పెట్టిస్తున్నారని వైస్సార్సీపీ నేత‌లు ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అలాగే, చంద్రబాబుకు బహిరంగ సభలో ఓ యువ‌కుడు ఓ ప్రశ్న వేశాడు. జనసేనతో కలిసి మ‌ళ్లీ పనిచేస్తారా? అని అడిగాడు. దీంతో చంద్ర‌బాబు స్పందిస్తూ.. నీవు ఒక అమ్మాయిని లవ్‌ చేస్తే స‌రిపోదు.. రెండు వైపుల నుంచి లవ్‌ ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలోనే సోము వీర్రాజు లవ్ అంటూ వ్యాఖ్య‌లు చేశారు.