తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాదాభివందనం చేస్తున్నానని నటుడు సుమన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందంటే అది కేసీఆర్ వల్లే అని..ఈరోజు తెలంగాణ ప్రజలు తలెత్తుకొని బతుకుతున్నారంటే అది కేవలం కేసీఆర్ వల్లే అని..ఆయనను ఓ మాట అనేముందు ఆలోచించుకోవాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ గొంగొడి మహేందర్ రెడ్డి తో కలిసి సుమన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి చెప్పాలి… మన హిందువులకు ఆయన ఇచ్చిన బహుమతి యాదాద్రి ఆలయమన్నారు. దాన్ని చూసి తరతరాలు గర్వపడతాయని… ఎంత డబ్బు అయినా.. సరే ఖర్చు పెట్టి ఆలయాన్ని దేశంలోనే ది బెస్ట్ గా తీర్చిదిద్దుతున్నారని వెల్లడించారు. ఆయనది గొప్ప మనసని.. ఒక హిందువుగా కేసీఆర్ కు పాదాభివందనం చేస్తున్నాని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, ఇతరులు ఇలా చాలా మంది పాల్గొన్నారని సుమన్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ వల్లే ఈరోజు తెలంగాణ ఎంతగా అభివృద్ధి చెందుతుందని కొనియాడారు.