తెలంగాణ

బీజేపీ కార్పొరేటర్లకు కనీసం కూర్చునే అవకాశం ఇవ్వని తెరాస నేతలు

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో స్వచ్ఛ వాహనాల ప్రారంభోత్సవంలో బీజేపీ కార్పొరేటర్లకు చేదు అనుభవం ఎదురైంది. స్టేజ్ ఫై వారికీ కూర్చునే అవకాశం ఇవ్వలేదు తెరాస నేతలు. మంగళవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో స్వచ్ఛ వాహనాల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి మల్లారెడ్డి తో పాటు పలువురు తెరాస నేతలు హాజరయ్యారు. అయితే బీజేపీ కార్పొరేటర్లకు కనీసం స్టేజీపైన కూర్చునే అవకాశం కూడా కల్పించలేదని 19వ డివిజన్ కార్పొరేటర్ సామల పవన్ కుమార్ రెడ్డి, 14వ డివిజన్ కార్పొరేటర్ కుంభం కిరణ్ కుమార్ ఆరోపించారు.

ఈ సందర్భాంగా వారు మాట్లాడుతూ..బోడుప్పల్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్వచ్ఛ వాహనాల ప్రారంభోత్సవంలో బీజేపీ కార్పొరేటర్లకు కనీసం స్టేజ్ పైన కుర్చీలు కూడా వేయకుండా తమను అవమానించారని, తాము స్టేజ్ పైన కాకుండా పక్కకు నిలబడాల్సి వచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వ ధనంతో జరుగుతున్న స్వచ్ఛ వాహనాల అభివృద్ధి కార్యక్రమానికి ఆటంకం కలిగించకూడదనే ఉద్దేశంతో ఓపికతో ఉన్నామని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ డబ్బుతో టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.