సికింద్రాబాద్ క్లబ్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంతో క్లబ్ పూర్తిగా దగ్ధమైంది.
10 ఫైర్ ఇంజన్లు దాదాపుగా మూడు గంటలుగా మంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 20 ఎకరాల స్థలంలో ఈ క్లబ్‌ను 1878 బ్రిటీష్ హయాంలో నిర్మించారు. ఇది భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి 2017లో పోస్టల్ కవర్ కూడా విడుదల చేశారు. కాగా.. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.