తెలంగాణ

సంగారెడ్డి జిల్లాలో కుటుంబం ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనాపురి కాలనీలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రెండు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్లు కలనీవాసులు భావిస్తున్నారు. కుటుంబ తగాదాలే ఆత్మహత్యకు కారణంగా అనుమానిస్తున్నారు. మృతులు శ్రీకాంత్ గౌడ్( 42), అతని భార్య అంకిత (40)తోపాటు వారి ఏడేళ్ల చిన్నారి విషయం సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల క్రితం మరణించినట్లు తెలుస్తుంది. కాలనీలో దుర్వాసన రావడంతో కాలనీకి చెందిన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శ్రీకాంత్ గౌడ్ ఇంట్లోకి వెళ్లి చూడగా కుటుంబం విగతా జీవులుగా పడి ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.