జాతీయం ముఖ్యాంశాలు

రిపబ్లిక్‌ డే సందర్బంగా గో ఫస్ట్‌ ప్రత్యేక ఆఫర్‌

గో ఫస్ట్‌ .. రిపబ్లిక్‌ డే ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. విమాన టికెట్‌ ధరలపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. రైట్‌ టూ ఫ్లై పేరుతో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఆఫర్‌లో భాగంగా దేశీయ విమాన ప్రయాణానికి ప్రారంభ టికెట్‌ ధర రూ.926గా కంపెనీ ప్రకటించింది. ఇది పరిమితి కాలపు ఆఫర్‌ అని స్పష్టం చేసింది. ఈ ఆఫర్‌ కింద టికెట్‌ సేల్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. జనవరి 26 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉండనుంది. ఈ సమయంలో టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులు.. తమ ప్రయాణ తేదీలను ఫిబ్రవరి 11 నుంచి మార్చి 31లోపు తమకు అనుకూలమైన తేదీల్లో బుకింగ్‌ చేసుకోవ చ్చు. ఈ ఆఫర్‌ ఒక వైపు ప్రయాణానికి మాత్రమే వర్తిస్తుంది.

గో ఫస్ట్‌ ఆఫీషియల్‌ వెబ్‌సైట్‌ తోపాటు ఇతర అన్ని మార్గాలలోనూ టికెట్లు బుక్‌ చేసుకోవచ్చునని కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్‌ ద్వారా విమాన ప్రయాణం చేసేవారికి 15 కిలోల వరకు లగేజీ ఛార్జీలు ఉండవు. టికెట్‌ క్యాన్సిల్‌ సదుపాయం కూడా ఉంది. అయి తే సాధారణ నిబంధనలు, ఛార్జీ లకు లోబడే క్యాన్సిలేషన్‌ చేసు కోవాల్సి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ప్రయాణ తేదీకి మూడు రోజుల ముందు వరకు ఎలాం టి ఛార్జీలు లేకుండా టికెట్‌ షెడ్యూల్‌ మార్పులు చేసు కోవచ్చునని రిపబ్లిక్‌ డే ఆఫ ర్‌లో స్పైస్‌ జట్‌ పేర్కొంది.