యాక్టివ్ కేసులు 22,23,018
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. మొన్న దేశంలో 2,55,874 కరోనా కేసులు నమోదు కాగా, నిన్న 2,85,914 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వివరాలు తెలిపింది. కరోనాతో నిన్న 665 మంది ప్రాణాలు కోల్పోయారు.
అలాగే, నిన్న కరోనా నుంచి 2,99,073 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 22,23,018 మంది చికిత్స పొందుతున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 16.16 శాతంగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 1,63,58,44,536 వ్యాక్సిన్ డోసులు వేశారు.