Uncategorized

దేశంలో కొత్త‌గా 2,86,384 క‌రోనా కేసులు

మృతుల సంఖ్య‌ మొత్తం 4,91,700

దేశంలో క‌రోనా ఉద్ధృతి కొన‌సాగుతోంది. నిన్న 2,86,384 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. 573 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించింది. నిన్న క‌రోనా నుంచి 3,06,357 మంది కోలుకున్న‌ట్లు వివ‌రించింది.

ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 22,02,472 మందికి చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,63,84,39,207 డోసుల వ్యాక్సిన్లు వేశారు. దేశంలో క‌రోనాతో మొత్తం 4,91,700 మంది మృతి చెందారు. మొత్తం 72,21,66,248 క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.