జాతీయం

కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కు కరోనా పాజిటివ్

కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు బయటపడటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి జైశంకర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవలి కాలంలో తనను కలిసినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాగా, దేశంలో కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కోవిడ్ బారిన పడ్డారు.