చర్చలకు సిద్దంగా ఉన్నాం… ఉద్యమాలెందుకు ? : సజ్జల
పీఆర్సీపై ఉద్యోగులతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీలో ఉద్యోగ సంఘాలు చలో విజయవాడ కార్యక్రమం చేపట్టడంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ప్రజా జీవితం స్తంభింపజేయడం ఎంత వరకు కరెక్ట్ అని అన్నారు. బలప్రదర్శన పెట్టి ప్రజా జీవితాన్ని స్తంభింపజేయొద్దన్నారు. ఉద్యోగుల మూడు డిమాండ్లు కాలం చెల్లినవని అన్నారు. చేసే అవకాశం లేని డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారన్నారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దన్నారు. ప్రభుత్వం ఎంత చేయగలదో అంతా చేస్తోందన్నారు.