జాతీయం తెలంగాణ ముఖ్యాంశాలు

బీజేపీ భీం పాదయాత్ర ప్రారంభం

ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ నుండి ‘బీజేపీ భీం పాదయాత్ర’ ప్రారంభ‌మైంది. బీజేపీ తెలంగాణ‌ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంత‌రం ‘‘బీజేపీ భీం పాదయాత్ర’’ను ప్రారంభించారు. తెలంగాణ భవన్ నుండి పార్లమెంట్ వైపుగా ‘‘బీజేపీ భీం పాదయాత్ర’’ బ‌య‌ల్దేరింది. బండి సంజయ్ తోపాటు బీజేపీ భీం పాదయాత్రలో ఎంపీలు సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇంఛార్జ్, కోలార్ ఎంపీ మునుస్వామి, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ ఇంఛార్జ్ కామర్సు బాలసుబ్రమణ్యం, కేంద్ర జలవనరుల విభాగం సలహాదారు వెదిరె శ్రీరాం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, సమన్వయకర్త నూనె బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.