జాతీయం ముఖ్యాంశాలు

దేశంలో కొత్తగా 67,597 క‌రోనా కేసులు

మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 5,02,874

దేశంలో రోజువారీ క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. నిన్న దేశంలో 67,597 క‌రోనా కేసులు నమోద‌య్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. నిన్న కోలుకున్న వారి సంఖ్య‌ 1,80,456గా ఉందని తెలిపింది. నిన్న క‌రోనా వ‌ల్ల‌ 1,188 మంది మృతి చెందారు.

ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 9,94,891 మంది క‌రోనాకు చికిత్స తీసుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మ‌ర‌ణాల సంఖ్య‌ 5,02,874కు పెరిగింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 5.02 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 170,21,72,615 డోసుల క‌రోనా వ్యాక్సిన్లు వినియోగించారు.