తెలంగాణ ముఖ్యాంశాలు

తెలంగాణలో ఏప్రిల్ 20 నుంచి ఇంటర్ పరీక్షలు

మే 10తో ముగియనున్న పరీక్షలు

తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఇంటర్ బోర్డు నిన్న టైం టేబుల్ విడుదల చేసింది. ఈసారి 70 శాతం సిలబస్, అంతే శాతంతో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రభుత్వం విడుదల చేసిన టైం టేబుల్ ప్రకారం.. ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఫస్టియర్, 21వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.

ప్రాక్టికల్స్ మాత్రం మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరుగుతాయి. ఏప్రిల్ 11న ఫస్టియర్ విద్యార్థులకు నైతికత, మానవీయ విలువలు, 12న పర్యావరణ విద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు మే 2 నాటికి, సెకండియర్ విద్యార్థులకు అదే నెల 5వ తేదీ నాటికి పరీక్షలు పూర్తవుతాయి. అన్ని పరీక్షలు అదే నెల 10న ముగిస్తాయి.