ఆంధ్రప్రదేశ్ కళలు ముఖ్యాంశాలు

సీఎం జగన్ తో మరోసారి భేటీ కానున్న మెగాస్టార్

నెల రోజుల వ్యవధిలో రెండో సారి భేటీ

సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి మరోసారి భేటీ కానున్నారు. ఈనెల 10వ తేదీన ముఖ్యమంత్రిని ఆయన కలవనున్నారు. చిరంజీవితో పాటు మరో ఐదుగురు సినీ ప్రముఖులు సీఎంతో సమావేశం కానున్నారు. టికెట్ ధరలతో పాటు, సినీ పరిశ్రమ సమస్యలపై వీరు చర్చించనున్నారు. వాస్తవానికి ఈరోజు జగన్ తో భేటీ కావాలని చిరంజీవి భావించారు. అయితే ఇండస్ట్రీ పెద్దలు అందుబాటులో లేకపోవడంతో సమావేశం 10వ తేదీకి వాయిదా పడింది.

నెల రోజుల వ్యవధిలో జగన్ తో చిరంజీవి భేటీ కానుండటం ఇది రెండో సారి. జనవరి 13న తాడేపల్లిలోని జగన్ నివాసానికి చిరంజీవి వెళ్లారు. అప్పుడు ఆయన సింగిల్ గానే వెళ్లడం తెలిసిందే. ఈ సారి సమావేశం తర్వాత ఇండస్ట్రీ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని అందరూ ఆశాభావంతో ఉన్నారు.