30 వేల మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి
ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే భారీ ఎత్తున పదోన్నతులు లభించనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ నోట్ విడుదల చేసింది. ఈ నోట్ ను అన్ని జిల్లా, డివిజన్, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పంపించింది. రాష్ట్రంలోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో వచ్చే జూన్ లోగా దాదాపు 30 వేల మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కలగబోతోంది. మరోవైపు కొత్తగా 833 జూనియర్ కాలేజీలు రాబోతున్నాయి. దీంతో స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్న వారికి జూనియర్ లెక్చరర్లుగా, ప్రధానోపాధ్యాయులకు ప్రిన్సిపాల్ గా ప్రమోషన్ లభించనుంది.