ఉక్రెయిన్‌పై యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఆ దేశంపై ఏ క్షణమైనా దాడికి చేయడానికి రష్యా సర్వం సన్నద్ధం చేసుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఉన్న తమ పౌరులు వెంటనే స్వదేశానికి వచ్చేయాలని అమెరికా అధ్యక్షుడు బోబైడెన్ కోరారు. అమెరికన్ పౌరులు వెంటనే ఉక్రెయిన్‌ను విడిచిపెట్టాలని సూచించారు. రష్యాతో ముప్పు పొంచి ఉన్నదని, ఒకవేళ రెండు దేశాల సైన్యాలు యుద్ధానికి దిగాల్సివస్తే పరిస్థితి భయానకంగా ఉంటుందని హెచ్చరించారు. ప్రపంచంలో అతిపెద్ద సైన్యం కలిగిన దేశాల్లో ఒకటైన రష్యాతో డీల్ చేస్తున్నాం. ఏ క్షణమైన పరిస్థితులు మారిపోవచ్చు అని బైడెన్ చెప్పారు.
ఎన్నిదేశాలు అభ్యంతరాలు చెప్పినా ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా వెనక్కి తగ్గడంలేదు. ఉక్రెయిన్‌పై దాడిచేసి తమ భూభాగంలో కలిపేసుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా లక్షలాది మంది సైనికులను సరిహద్దు వద్ద మోహరిస్తున్నది. అయితే ఉక్రెయిన్‌పై దాడిచేయొద్దని అమెరికా ఇప్పటికే రష్యాను హెచ్చరించింది. సరిహద్దుల్లో సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని సూచించింది.