కేసీఆర్‌పై షర్మిల విమర్శలు
ఉక్రెయిన్‌లో రష్యా దాడులు చేస్తుండడంతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారి కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతోన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని, చిక్కుకున్న వారికి వసతి, భోజనం కల్పించేలా చూడాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరిగింది.
దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఆదేశించగలమా? అని ప్రశ్నించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల పట్ల సానుభూతి ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా కలిచివేస్తున్నట్లు తెలిపారు. తాను సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో చూశానని, అందులో సీజేఐ ఏం చేస్తున్నారని ఒకరు అడిగారని గుర్తు చేసుకున్నారు. అయితే, ఆ యుద్ధాన్ని ఆపాలని తాను పుతిన్‌ను ఆదేశించలేను కదా? అని ఎన్వీ రమణ అన్నారు.