దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 62,224 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆర్యోమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 1,07,628 మంది బాధితులు కొలుకోని డిశ్చార్జి అయ్యారు. మరో 2,542 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,33,105కు చేరగా.. ఇప్పటి వరకు 2,83,88,100 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 3,79,573 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 8,65,432 యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పింది.
వరుసగా 34వ రోజు రోజువారీ రికవరీ కేసులు.. కొత్త కేసులను మించి పోయాయని, రికవరీ రేటు 95.80శాతానికి పెరిగిందని మంత్రిత్వశాఖ చెప్పింది. వ్లీకీ ప్లాజిటివిటీ రేటు ఐదు శాతానికి కన్నా తక్కువకు పడిపోయిందని, ప్రస్తుతం 4.17శాతంగా ఉందని.. రోజువారీ పాజిటివిటీ రేటు 3.22శాతంగా ఉందని చెప్పింది. వరుసగా తొమ్మిదో రోజు ఐదో శాతానికన్నా తక్కువగా ఉందని చెప్పింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 38.33 కోట్ల కరోనా శాంపిల్స్ పరీక్షించామని, వ్యాక్సిన్ డ్రైవ్‌లో 26.19కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.