తెలంగాణ ముఖ్యాంశాలు

రాచరిక పాలనను అంతం చేయాలి

‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో వైఎస్ షర్మిల

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న రాచరిక పాలనను అంతం చేయాలని వైఎస్సార్టిపి వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆదివారం జిల్లాలోని భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో 31వ రోజు ప్ర‌జాప్ర‌స్థానం పాదయాత్ర నిర్వహించారు. ఏ సందర్బంగా షర్మిల మాట్లాడారు. అధికార పార్టీ తన పాదయాత్రను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. ఎవరు ఎలాంటి అడ్డంకులు సృష్టించినా తన పాదయాత్ర ఆగేదే లేదన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలను పలకరిస్తూ , సమస్యలు అడుగుతూ పాదయాత్ర చేస్తున్నారు.