సూరత్‌లోని పండేసర జిఐడిసి ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడి అమిత్ సిల్క్ మిల్‌లో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ వెంటనే అప్రమత్తం అయింది.
17 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఈ అగ్నిప్రమాదం లో టెక్స్‌టైల్ మిల్లు పూర్తిగా దహనం అయింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు.