జాతీయం ముఖ్యాంశాలు

మార్చి 31 నుంచి కోవిడ్ నిబంధనలను తొలగిస్తున్న కేంద్రం కానీ..

మాస్క్ ధరించడం మాత్రం తప్పనిసరి.. కేంద్రం

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను ఎత్తివేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి అన్ని కోవిడ్ నిబంధనలను తొలగిస్తున్నట్టు కేంద్రం ఈరోజు ఓ ప్రకటనలో తెలిపింది.

అయితే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం మాత్రం తప్పనిసరి అని చెప్పింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. మార్చి 31తో కోవిడ్ రూల్స్ ముగుస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మన దేశంలో ఇప్పటి వరకు 1,81,89,15,234 డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ వ్యాక్సినేషన్ వల్ల భారత్ లో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడింది.