తెలంగాణ లో పెరిగిన కరెంట్ చార్జీలను తగ్గించాలంటూ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ సౌధ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. విద్యుత్ ఛార్జీల తో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా నేడు విద్యుత్ సౌధ తో పాటు పౌరసరఫరాల కమిషనర్ కార్యాలయాల ముందు కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసేందుకు పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 11 గంటలకు నెక్లెస్ రోడ్డు నుంచి ర్యాలీగా బయలుదేరి విద్యుత్తు సౌధ వరకూ చేరుకోవాలని అన్నారు.
2001లో బషీర్‌బాగ్‌లో జరిగిన దాని కంటే ఎక్కువ విద్యుత్ సౌధ ముందు జరగాలని, ఇందులో అందరూ పాల్గొనాలని, లెఫ్ట్ పార్టీల నేతలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. లాఠీ దెబ్బలకు తుపాకీ తూటాలకు తానే ముందుంటానని, ఎవరూ భయపడొద్దని, ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుందో చూస్తానన్నారు. రేవంత్ పిలుపుతో పెద్ద సంఖ్య లో కాంగ్రెస్ నేతలు, కార్య కర్తలు ఆందోలనకు సిద్ధమయ్యారు. అయితే ఈ ఆందోళనలను పోలీసులు అడ్డుకుంటున్నారు. రేవంత్ ఇంటి వద్ద భారీగా పోలీసులు చేరుకొని రేవంత్ ను ఇంటి నుండి బయటకు వెళ్లకుండా అడ్డుకునేందుకు చూస్తున్నారు.