పాత డిప్యూటీ సీఎంలలో ఇద్దరికి చోటు
ఏపీ కేబినెట్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఏపీ కేబినెట్‌లో గతంలో మాదిరే తాజాగా పునర్వవస్థీకరణ తర్వాత కూడా ఐదుగురు డిప్యూటీ సీఎంలు కొనసాగనున్నారు. ఈ మేరకు సోమవారం కేబినెట్ పునర్వవస్థీకరణ జరిగిన తర్వాత ఐదుగురు డిప్యూటీ సీఎంలను ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పాత కేబినెట్‌లో డిప్యూటీ సీఎంలుగా కొనసాగిన వారిలో కళత్తూరు నారాయణస్వామి (ఎస్సీ), అంజాద్ బాషా (మైనారిటీ)లకు పునర్వవస్థీకరణ తర్వాత కూడా డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. కొత్తగా పీడిక రాజన్నదొర (ఎస్టీ), కొట్టు సత్యనారాయణ (కాపు), బూడి ముత్యాలనాయుడు (బీసీ)లకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. అయితే డిప్యూటీ సీఎంగా ఈ దఫా మహిళకు స్థానం దక్కకపోవడం గమనార్హం.