బిహార్ సీఎం నితీశ్ కుమార్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పై విమర్శలు కురిపించారు. తనకు అధికారం, పదవులపై ఏమాత్రం ఆశల్లేవన్న రాహుల్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. అసలు కాంగ్రెస్ తుడిపెట్టుకుపోవడానికి కారకులెవ్వరో అందరికీ తెలుసని చురకలంటించారు. రాహుల్ వ్యాఖ్యలపై నేనేం మాట్లాడాలి? పార్టీ గురించి, అతని గురించి ఆయన ఏమనుంటున్నారు? పార్టీని ఆయనే నడుపుతున్నారు. పార్టీ పతనానికి ఎవరు బాధ్యులో ప్రజలకు బాగా తెలుసు. అయినా రాహుల్ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదు అంటూ నితీశ్ పరోక్షంగా రాహుల్‌పై విరుచుకుపడ్డారు.
కాగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. వరుసగా అధికారం అనుభవిస్తున్న కుటుంబంలోనే తాను పుట్టానని, అయినా తనకు అధికారం, పదవులపై ఎలాంటి ఆశలూ లేవని రాహుల్ స్పష్టం చేశారు.