దేశంలో కరోనా కేసులు వెయ్యిలోపే కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 796 నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా 929 మంది కరోనా నుంచి కోలు కున్నారు. కరోనాతో 19 మంది మృతి చెందారు. దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,36, 928కు చేరింది.
ఇందులో 4,25,04,329 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరుకు దేశవ్యాప్తంగా మొత్తం 5,21,710 మంది బాధితులు కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో 10,888 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా పాజిటివిటి రేటు 97.67 శాతంగా ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,85,74,68,616 కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.