జాతీయం ముఖ్యాంశాలు

దేశంలో కొత్తగా 949 కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,191

దేశంలో గత 24 గంటల్లో 3,67,213 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా… కొత్తగా 949 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో ఆరుగురు మృతి చెందగా… 810 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,21,743కి చేరుకుంది. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4,25,07,038కి పెరిగింది.

రికవరీల కంటే కొత్త కేసులు కొంచెం ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో 11,191 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 186.30 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో కేసులు క్రమంగా పెరుగుతుండటం మరోపక్క ఆందోళన కలిగించే అంశం. అంతకు ముందు రోజు ఢిల్లీలో 299 కేసులు నమోదు కాగా… నిన్న 325 కేసులు నమోదయ్యాయి.