అంతర్జాతీయం ముఖ్యాంశాలు

ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల్లోని ర‌ష్యా ఆయిల్ డిపోలో భారీ మంట‌లు

సోమ‌వారం అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఆయిల్ డిపోలో ప్ర‌మాదం సంభ‌వించ‌డంతో పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. ఈ విష‌యాన్ని ఎమ‌ర్జెన్సీ విభాగ నిపుణులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల్లోని ర‌ష్యా ఆయిల్ డిపోలో ప్ర‌మాద స్థ‌లం బ్రయాన్స్క్, ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల్లో మాస్కోకి 300 కిలోమీట‌ర్ల దూరంలో వుంది. ఖార్కీవ్ ప్రాంతంలోని చుగ్వివ్‌లోని ఆయిల్ డిపోను ర‌ష్య‌న్ ద‌ళాలు ధ్వంసం చేసిన కొన్ని రోజుల‌కే ర‌ష్యా ఆయిల్ డిపోలో మంట‌లు చెలరేగ‌డం గ‌మనించాల్సిన అంశం.