ట్విట్టర్ బోర్డు ఓకే
ట్విట్టర్ నూతన అధినేతగా టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ మారారు.. ఏఎఫ్ పి కధనం ప్రకారం , ట్విట్టర్ ను కొనుగోలు చేయటానికి మస్క్ సుమారు 44 బిలియన్ల డాలర్లు ఖర్చు చేశారని తెలిసింది.. గతంలో ట్విట్టర్ యాజ మాన్యాన్ని మస్క్ కు ఇచ్చేందుకు రెడీగా ఉందని తెలిపింది కూడా.. ఈమేరకు సోమవారం రాత్రి ట్విట్టర్ బోర్డు మస్క్ ఆఫర్ కు ఓకే చెప్పింది.
. ఇదిలా ఉండగా, ఒప్పందం పూర్తయిన వెంటనే ట్విట్టర్ ఇక ప్రైవేట్ కంపెనీగా మారబోతుంది.. మస్క్ నేతృత్వంలో ట్విట్టర్ నూతన మజిలీ ప్రారంభించనుంది.. కాగా, ఇకపై ఎలోన్ మస్క్ ను ట్విట్టర్ యజమాని అని పిలవచ్చని పేర్కొంటూ మస్క్ ట్వీట్ చేశారు..