ముఖ్యాంశాలు

నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్

నేడు సీఎం జగన్ దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో సీఎం భేటీ కానున్నారు. రేపు జరుగనున్న జ్యుడీషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి ప్రధాని, సీజేఐ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. దేశంలో న్యాయ మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారంపై సెమినార్ జరగనుంది.