కుప్పంలో గ్రానైట్ అక్రమ మైనింగ్‌పై లేఖ
కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ మైనింగ్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎస్‌కు లేఖ రాశారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ముద్దనపల్లిలో సర్వే నెంబర్ 104, 213లలో అక్రమ మైనింగ్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను జతచేసి ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. గ్రానైట్ అక్రమ మైనింగ్‌పై ఎన్జీటీ ఇచ్చిన అదేశాలను తక్షణమే అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు.
ముద్దనపల్లిలో అక్రమ మైనింగ్‌ను ఎన్జీటీ నిర్థారించిదని తెలిపారు. అక్రమ మైనింగ్ పాల్పడిన వారి పేర్లు, వివరాలు తెలపాలన్న ఎన్జీటి ఆదేశాలను లేఖలో ప్రస్తావించారు. ప్రధాన కార్యదర్శి సహా ఇతర అధికారులు స్వయంగా పరిశీలించి మైనింగ్‌పై శాస్త్రీయ నివేదిక ఇవ్వాలన్న ఆదేశాలను అమలు చేయాలని కోరారు. పటిష్టమైన చర్యలతో అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలని ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.