కోవోవాక్స్ కు ఎన్‌టాగీ అనుమతి
దేశంలో 12-17 ఏళ్ల లోపు వారికి కోసం సీరమ్ ఇనిస్టిట్యూట్ తీసుకొచ్చిన కోవోవాక్స్ టీకాకు అనుమతి లభించింది. ఎన్‌టాగీ కోవోవాక్స్ ను కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో చేర్చాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కాగా, కొవిడ్ టీకా రెండో డోసు, ప్రికాషన్ డోసుల మధ్య విరామ సమయాన్ని తగ్గించే విషయం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది.
ప్రస్తుతం ఈ రెండు డోసుల మధ్య వ్యవధి 9 నెలలు ఉండగా దీనిని ఆరు నెలలకు తగ్గించే అంశంపైనా చర్చ జరిగింది. అలాగే, విద్య, ఉద్యోగం, క్రీడలు, వాణిజ్య సమావేశాల కోసం విదేశాలకు వెళ్లే వారికి 9 నెలల విరామాన్ని తగ్గించి ప్రికాషన్ డోసు ఇవ్వాలన్న విషయం చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయితే, ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని సమాచారం.