108 వాహన సిబ్బంది నిరాకరించడంతో రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని తండ్రి ఆస్పత్రి నుంచి బైక్‌పై స్వగ్రామానికి తీసుకెళ్లాడు. నెల్లూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అంతేకాదు నాయుడుపేట నుంచి మృతదేహం తీసుకెళ్లేందుకు ఆటో వాళ్ళూ కూడా నిరాకరించారు. దీంతో డబ్బుల్లేక ప్రైవేటు అంబులెన్స్‌ను పిలవలేక బైక్‌పైనే మృతదేహం తీసుకెళ్లాడు.
సేకరించిన వివరాల ప్రకారం .. దొరవారిసత్రం మండలం కొత్తపల్లి చెందిన అక్షయ(2) గురువారం గ్రావెల్ గుంతలో ప్రమాదవశాత్తు పడింది. అక్షయ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. నాయుడుపేట ఆస్పత్రికి తరలించేలోగా చిన్నారి మృతి చెందింది. దీంతో చిన్నారి మృతదేహాన్ని తిరిగి స్వగ్రామం తరలించేందుకు 108 వాహన సిబ్బంది నిరాకరించడంతో ఆ చిన్నారి తండ్రి అవస్థలు పడ్డాడు. ఏవాహనం రాకపోవటంతో తన బైక్ పైనే చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తీసుకుకెళ్లారు .