తెలంగాణ

పంజాగుట్ట‌లో పాద‌చారుల వంతెనను ప్రారంభించిన దానం నాగేంద‌ర్

నగరంలోని రద్దీ ఏరియాల్లో పాద‌చారుల వంతెన్లను సర్కార్ ఏర్పటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు వంతెనలను ఏర్పాటు చేయగా..తాజాగా పంజాగుట్ట హైద‌రాబాద్ సెంట్ర‌ల్ మాల్ వ‌ద్ద ఏర్పాటు చేసిన ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జిని ఈరోజు జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ క‌లిసి ప్రారంభించారు.

పంజాగుట్ట జంక్ష‌న్ వద్ద వాహ‌నాల రద్దీ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఇక్క‌డ పాద‌చారులు రోడ్డును దాటేందుకు తీవ్ర ఇబ్బంది పడుతుంటుంటారు. వీరు ప‌డుతున్న ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకొని ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ఇలాంటి ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జిలు న‌గ‌రంలో మ‌రో 6 నిర్మాణంలో ఉన్నాయ‌ని, వీటిని 4 నుంచి 6 వారాల్లో ప్రారంభించ‌నున్నారు.