ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావుపై అట్రాసిటీ కేసు

ప్ర‌త్తిపాటితో పాటు ప‌లువురు టీడీపీ నేత‌ల‌పై కూడా కేసు

ఏపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ప‌ల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మంచి నీటి చెరువు వద్ద ఎన్టీఆర్ సుజల పథ‌కం ప్రారంభ సమయంలో టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ను టీడీపీ నేత‌లు కులం పేరుతో దూషించారని మునిసిపల్ సూపర్‌వైజర్ కోడిరెక్క సునీత అర్బన్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ నేప‌థ్యంలోనే ప్ర‌త్తిపాటితో పాటు ప‌లువురు టీడీపీ నేత‌ల‌పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ పీఏఓ యాక్ట్ 323, 34, 353, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా పుల్లారావు, ఏ2గా మదన్ మోహన్, ఏ3గా బండారుపల్లి సత్యనారాయణ, ఏ4గా కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు శ్రీనివాసరావు, ఏ5గా కరీముల్లా ఉన్నారు.