అంతర్జాతీయం ముఖ్యాంశాలు

పుతిన్ కు తీవ్ర అనారోగ్యం! : బ్రిటన్‌ మాజీ గూఢచారి

పుతిన్ బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్నట్టు ధ్రువీకరించిన రష్యా సంపన్నుడు
ఓ మేగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్టఫర్ స్టీల్ వ్యాఖ్యలు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని బ్రిటన్‌ మాజీ గూఢచారి క్రిస్టోఫర్ స్టీల్ తెలిపారు. పుతిన్ బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్నారని ఓ మేగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య సమస్య ఏంటనేది కచ్చితంగా తెలియదని పేర్కొన్న ఆయన.. అది నయమయ్యేదో, కాదో కూడా తెలియదని చెప్పుకొచ్చారు.

రష్యాతోపాటు ఇతర చోట్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పుతిన్ తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారని అన్నారు. రష్యా కుబేరుడు కూడా ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఉక్రెయిన్‌‌పై యుద్ధ ప్రకటనకు ముందే ఆయనకు కేన్సర్ చికిత్సలో భాగంగా వెన్నుకు ఆపరేషన్ జరిగిందని వివరించారు. పుతిన్‌తో తనకు సన్నిహిత సంబంధం ఉందని, ఆయన తీసుకున్న ఓ పిచ్చి నిర్ణయంతో ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.