ఆంధ్రప్రదేశ్

ప్రజల మనసులో ‘టంగుటూరి’ చిరస్మరణీయం

ఏపీ సీఎం జగన్

స్వాతంత్ర్య పోరాట యోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు కూ యాప్ లో సీఎం పోస్ట్ చేశారు.
తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు అని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజల మనసులో చిరస్మరణీయంగా నిలిచిన ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. ఆయన త్యాగం, సాహసం భావితరాలకు ఆదర్శం అని సీఎం పేర్కొన్నారు