ప్రకాశం జిల్లా వాడ రేవులో దుర్ఘటన
సముద్రంలో స్నానం చేసేందుకు సరదాగా వెళ్లిన ఒక విద్యార్థి గల్లంతయ్యాడు.. సేకరించిన వివరాల ప్రకారం ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాలోని చీరాల వాడరేవు వద్ద సముద్ర స్నానానికి స్నేహితులతో వచ్చిన పిడుగురాళ్లకు చెందిన విద్యార్థి పి. హితేష్ (17) గల్లంతయ్యాడు. దీంతో హితేష్ జాడకోసం అతని స్నేహితులు తీరం వద్ద రోధిస్తున్నారు.