దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,414
దేశంలో కరోనా కేసుల నమోదులో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ముందు రోజుకంటే ఏకంగా 24 శాతం కేసులు అధికంగా వచ్చాయి. నిన్న 2,628 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 2,167 మంది కరోనా నుంచి కోలుకోగా.. 18 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 15,414 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు 98.75 శాతంగా, క్రియాశీల రేటు 0.04 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 5.24 లక్షల మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకు 192 కోట్లకు పైగా కరోనా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్క రోజే 13.13 లక్షల మంది టీకా వేయించుకున్నారు.