నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆలయ రథాన్ని తరలించే క్రమంలో అపశ్రుతి నెలకొంది. నాంపల్లి మండలం కేతేపల్లి వద్ద ఓ ఆలయం సమీపంలో శనివారం ప్రమాదం సంభవించింది. శ్రీరామ రథోత్సవంలో రథాన్ని రథశాలకు చేర్చుతుండగా కరెంట్ తీగలు తగిలాయి.
దీంతో విద్యుత్ షాక్ తగిలి.. రథం లాగుతున్న వ్యక్తుల్లో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారు.. కేతేపల్లి గ్రామానికి చెందిన రాజాబోయిన యాదయ్య (42), పొగాకు మొనయ్య (43), మక్కలపల్లికి చెందిన కారు డ్రైవర్ దాసరి అంజి (20)గా గుర్తించామన్నారు. క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి, మృతదేహాలను మార్చరీకి తరలించామన్నారు.