భారతదేశంలో మైనారిటీలపై ఏడాదంతా దాడులే జరిగాయి..అమెరికా
అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ మతస్వేచ్ఛపై వార్షిక నివేదికను రిలీజ్ చేసింది. 2021లో ఇండియాలో మైనార్టీలపై ఏడాదంతా దాడి ఘటనలు చోటుచేసుకున్నట్లు ఆ రిపోర్ట్‌లో వెల్లడించారు. హత్యలు, దాడులు, బెదిరింపు ఘటనలు జరిగినట్లు ఆ నివేదికలో రాశారు. విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ రిపోర్ట్‌ను రిలీజ్ చేశారు. గోవులను తరలిస్తున్నవారిపై జరగుతున్న దాడులను తన రిపోర్ట్‌లో అమెరికా ఖండించింది. మత స్వేచ్ఛపై అమెరికా ఇచ్చిన రిపోర్ట్‌ను గతంలోనూ ఇండియా తిరస్కరించింది.