ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం లో గ్యాస్ లీక్‌ ..200 మందికి పైగా అస్వస్థత

అనకాపల్లిజిల్లా అచ్చుతాపురం SEZ లో అమోనియా గ్యాస్ లీక్‌ అయ్యింది. ఈ ఘటన లో దాదాపు 200 మందికి పైగా అస్వస్థతకు గురి కావడం తో స్థానిక హాస్పటల్ లో తరలించారు. క్వాంటం, సీడ్స్‌ యూనిట్‌లోకి ఒక్కసారిగా ఘాటైన వాయువు వెలువడం తో అందులో పనిచేస్తున్న సిబ్బంది అస్వస్థత కు గురయ్యారు. వాంతులు, తల తిరుగుడుతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. అస్వస్థతకు గురైన మహిళలను బ్రాండిక్స్ సెజ్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరికొంత మందిని సమీపంలోని ఆసుపత్రులకు చేరుస్తున్నారు. పోరస్‌ కంపెనీ నుంచి అమ్మోనియా వాయువు లీకైందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు.అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్​లో అమ్మోనియా లీకేజీ వ్యవహారంపై.. వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ రవి సుభాష్ అప్రమత్తం చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి వైద్యసేవలను పర్యవేక్షించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి హేమంత్ కుమార్​ను ఆదేశించారు. 20 అంబులెన్స్‌లతో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్‌ రవి సుభాష్‌ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై హోంమంత్రి తానేటి వనిత ఆరా తీశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో హోంమంత్రి సమీక్షించారు. సహాయ చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు