ట్విట్టర్ వేదికగా దివ్యవాణి సింగిల్ లైన్ స్టేట్‌మెంట్
టీడీపీ కి రాజీనామా చేసిన నటి దివ్యవాణి అతి త్వరలోనే తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆమె సింగిల్ లైన్ ప్రకటనను విడుదల చేశారు. తన తదుపరి కార్యాచరణను మీడియా ద్వారానే వెల్లడిస్తానని దివ్యవాణి ప్రకటించారు.
టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి మొన్న ఓ ట్వీట్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల ఆర్జునుడితో మాట్లాడిన అనంతరం ఆమె ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఆ తర్వాత పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. మళ్లీ అంతలోనే.. ఆ మరునాడు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. టీడీపీని వీడిన దివ్యవాణి త్వరలోనేవైస్సార్సీపీ లో చేరుతారన్న దిశగా ప్రచారం సాగుతోంది.