సీఎం కెసిఆర్ త్వరలోనే యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో పర్యటించనున్నారు. ఈ మేరకు వాసాలమర్రి సర్పంచ్ పోగుల అంజయ్య ఫోన్ చేసి మాట్లాడారు. ఈనెల 22న దత్తత గ్రామంలో పర్యటిస్తానని సీఎం కేసీఆర్ శుక్రవారం ఆయనకు చెప్పారు. ఈ సందర్భంగా ఊరంతా సామూహిక భోజనం చేద్దామని, అనంతరం గ్రామ సభ ఏర్పాటు చేసుకొని.. గ్రామ సమస్యలపై చర్చిద్దామని చెప్పారు. ఈ క్రమంలో సామూహిక భోజన ప్రదేశం, గ్రామ సభ నిర్వహణకు పెద్ద ఖాళీ స్థలాన్ని చూడాలని అంజయ్యకు సూచించారు. ఇక ఈ పర్యటన సందర్భంగా తుర్కపల్లి (మం), వాసాలమర్రిని సీఎం కేసీఆర్ దత్తత తీసుకోనున్నట్లు సమాచారం.
ఈ నెల 22న వాసాలమర్రి కి సీఎం కెసిఆర్, వాసాలమర్రి సర్పంచ్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్