జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచార కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పబ్ కు వచ్చిన 17 ఏళ్ల మైనర్ బాలికను ఇంటి వద్ద దింపుతామని చెప్పి కార్ ఎక్కించుకొని , గ్యాంగ్ రేప్ చేయడం సంచలనంగా మారింది. ఈ దారుణానికి పాల్పడిన వారంతా రాజకీయ నేతల కుటుంబాలకు చెందిన వారే కావడం తో ఈ కేసు ఫై అంత ఫోకస్ చేసారు. ప్రభుత్వం నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తుందని విపక్షాలు ఆరోపణలు చేయడం, పోలీసులు చూపని ఆధారాలు వారు బయటపెట్టడం తో మరింత ఇంట్రస్ట్ టాపిక్ అయ్యింది.
ప్రస్తుతం పోలీసులు ఈ ఘటన కు పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసారు. శనివారం ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆదివారం మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.మరో మైనర్‌తో పాటు ఉమేర్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు మైనర్లు, ఒక మేజర్ ఉన్నారు. కాగా, నిందితులంతా రాజకీయ నేతల కొడుకులుగా పోలీసులు గుర్తించారు.
నిందితులు ఎవరనేది చూస్తే..
A1.. సాదుద్దీన్(ఎంఐఎం నేత కొడుకు)
A2.. ఉమేర్‌ఖాన్(ఎమ్మెల్యే సోదరుడి కొడుకు)
మైనర్-1.. వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు
మైనర్-2.. ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు
మైనర్-3.. సంగారెడ్డి మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్ కొడుకు ఉన్నారు.
ఇక ఈ కేసు ఫై గవర్నర్ తమిళ సై..స్పందించారు. ఈ ఘటనపై నివేదికను సమర్పించాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు. 2 రోజుల్లో నివేదికను అందించాలని ఆదేశించారు.