ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఏపీలో కర్ఫ్యూ వేళల సడలింపు, ఉదయం 6 నుంచి సా.6 గంటల వరకు సడలింపు

ఏపీలో కర్ఫ్యూ వేళలను సడలించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. నేడు కొవిడ్‌పై జరిగిన సమీక్షా సమావేశంలో కర్ఫ్యూ సడలింపుపై జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఇస్తున్నామ‌ని, ఈ నెల 21 నుంచి ఈ స‌డ‌లింపులు అమల్లోకి వ‌స్తాయ‌ని అధికారులు ప్ర‌క‌టించారు. అయితే, సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు తెరుచుకోవ‌డానికి అనుమతి ఉంటుంద‌ని, మ‌రో గంట సేప‌ట్లో దుకాణాల సిబ్బందికి ఇంటికి వెళ్లేందుకు స‌మ‌యం ఉంటుంద‌ని చెప్పారు.